బిగ్ బాస్ సీజన్ 2 నిన్నటికివిజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుని 5వ వారంలోకి అడుగుపెట్టగా నిన్నటి రోజున బిగ్ బాస్ హౌస్ లో ఈ వారానికి సంబందించిన నామినేషన్ల ప్రక్రియ కాస్త వైవిధ్యంగా జరిగింది.
టెలిఫోన్ బూత్ ని ఏర్పాటు చేసి అందులో నుండి ఇంటి సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూ ఈ నామినేషన్ల ప్రక్రియని స్వయంగా బిగ్ బాసే నిర్వహించారు. అయితే ఆ ప్రక్రియ కాస్త వైవిధ్యంగా ఉండడంతో పాటుగా అసలు ఒకరి గురించి ఇంకొకరు ఏదో ఒకటి త్యాగం కాని వాళ్ళకి నచ్చనిది కాని చేయాల్సి ఉంటుంది.
అందులో భాగంగానే భానుశ్రీని నామినేషన్ నుండి తప్పించడానికి అమిత్ తన తలకి కట్టుకునే చేతి రుమాలుని ఈ సీజన్ మొత్తం ధరించకూడదు అని అదే సమయంలో ఇక పై బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా పోటీ చేసే అవకాశం కోల్పోవాల్సి ఉంటుంది.
అయితే ఈ టాస్క్ వినగానే వెంటనే చేస్తాను అని ఒప్పుకున్న అమిత్ ఆ తరువాత వెంటనే ఇంటి సభ్యుల మాటలకి పరోక్షంగా ప్రభావితం అయి ఆ టాస్క్ చేయడానికి వెనుకాడతాడు. దీనితో భానుశ్రీ ఈ వారం నామినేషన్ లో నిలిచింది.
హౌస్ లో ఈ ఇద్దరు ఎంతో కలిసి ఉండడం ఒకరిని ఒకరు సొంత తోబుట్టువులుగా అనుకునే వీరి మధ్యలో ఈ టాస్క్ చిచ్చు పెట్టింది అనే చెప్పాలి. ఒకరకంగా ఈ టాస్క్ పరంగా భానుశ్రీని అమిత్ మోసం చేసాడు అనే అభిప్రాయం నిన్న ఎపిసోడ్ చూసిన వారికి కలిగింది.