ముంబయ్‌లో సందడి చేయనున్న మన్మధుడు.!

By iQlikMovies - July 10, 2018 - 15:13 PM IST

మరిన్ని వార్తలు

చాలా కాలం తర్వాత నాగార్జున మళ్లీ బాలీవుడ్‌కి వెళుతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఈ వార్తల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి లేదు. 

అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌వీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న 'బ్రహ్మాస్త్రా' అనే చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడట. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున మంచి స్నేహితులు. గతంలోనూ ఈ ఇద్దరూ కలిసి బాలీవుడ్‌లో 'అగ్నివర్ష్‌', 'ఎల్‌వోసీ కార్గిల్‌', 'ఖుదా గవా' తదితర చిత్రాల్లో నటించారు. మళ్లీ ఇన్నాళ్ల గ్యాప్‌ తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందుతోంది. మరోవైపు నాగార్జున ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌ నానితో మల్టీ స్టారర్‌ చిత్రంలో నటిస్తున్నా సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి 'దేవదాస్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రంలో నాగ్‌ మాఫియా డాన్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగానే, కాస్త ఈ సినిమా నుండి గ్యాప్‌ తీసుకుని, నాగ్‌ ముంబయ్‌లో అమితాబ్‌ సినిమాకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొననున్నాడనీ బాలీవుడ్‌ వర్గాల ద్వారా తాజాగా అందుతున్న సమాచారమ్‌. 

అంటే ఒకేసారి మన టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ సత్తా చాటేస్తున్నాడన్నమాటే. తెలుగులో అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం'లో అమితాబ్‌ బచ్చన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS