కోర్టు సూచనతో ఆ సినిమా టైటిల్ మార్పు!

మరిన్ని వార్తలు

నవీన్ చంద్ర - సలోని లుత్రా హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ 'భానుమతి రామకృష్ణ' జులై 3 న ఆహా ఓటీటీ వేదిక ద్వారా విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ పై అలనాటి మేటి నటి భానుమతి రామకృష్ణ కుటుంబ సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తారు. నిర్మాతలు పట్టించుకోకపోవడంతో భానుమతి పెద్ద కుమారుడు ఈ విషయంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించారట. దీంతో కోర్టువారు సినిమా టైటిల్ ను మార్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం అందుతోంది.

 

దీంతో సినిమా నిర్మాతలు ఈ సినిమా టైటిల్ ను 'భానుమతి & రామకృష్ణ' గా మార్చాలని డిసైడ్ అయ్యారట. త్వరలోనే ఈ కొత్త టైటిల్ ను ప్రకటిస్తారని అంటున్నారు. మరి ఈ కొత్త టైటిల్ అయినా భానుమతి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారో లేదో వేచి చూడాలి. ఏదేమైనా ఈ టైటిల్ వివాదంతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కిందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

దర్శకుడు శ్రీకాంత్ నాగోతి సినిమాను ఆహ్లాదకరంగా తీర్చి దిద్దారని, ప్రేక్షకులకు నచ్చుతుందని అంటున్నారు. ఈ సినిమాను క్రిషివ్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS