షూటింగులకు అనుమతులు వచ్చిన తరవాత మొదటిగా పట్టాలెక్కేది `వకీల్ సాబ్` సినిమానే అనుకున్నారంతా. కానీ.,. చిత్రబృందం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కతుందో తేల్చడం లేదు. ఈలోగా వకీల్ సాబ్ నుంచి కొన్ని స్టిల్స్ బయటకు రావడంతో పవన్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఈ విషయమై దిల్ రాజు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
వకీల్ సాబ్ లో హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదని, తను ఎవరన్నది తెలిస్తే.. షూటింగ్ మొదలైపోతుందని ఓ టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకూ ఈ సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుందని చెప్పుకున్నారు. అయితే చిత్రబృందం ఈ నిర్ణయం మార్చుకుందని సమాచారం. శ్రుతి ప్లేసులో తమన్నాని ఎంచుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయమై తమన్నాతో సంప్రదింపులు కూడా మొదలెట్టార్ట. అయితే తమన్నా తన అంగీకారం తెలపాల్సివుంది. ఇది వరకు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ - తమన్నా జోడీ కట్టారు. ఈ సినిమా కూడా ఒప్పుకుంటే.. వారిద్దరూ కలసి నటించిన రెండో సినిమా అవుతుంది.