డ్రగ్స్ ఇష్యూలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఎక్సైజ్ శాఖ నుండి నోటీసులు అందుకున్న వారిలో ముందుగా సిట్ ఎదుట హాజరయ్యింది పూరీ జగన్నాధే. అయితే ఈ నేరంలో తనకేమాత్రం భాగం లేదంటున్నారు పూరీ. కావాలని గిట్టని వాళ్లు చేసిన పనే ఇది అని పూరీ వాపోతున్నారు. సినిమా అంటే తనకి ప్రాణమనీ, తానేం చేసినా సినిమాలో భాగంగానే చేశాననీ పూరీ చెబుతున్నారు. బ్యాంకాక్ తదితర ప్రాంతాలకు వెళ్లింది, పబ్స్‌లో తన సినిమాలు ఎక్కువగా షూట్ చేసేది కూడా సినిమాలో రిచ్ లుక్ కనిపించడం కోసమేనట. అలాగే తన సినిమాలు సమాజంలో జరిగే పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటాయని ఆయన చెప్పడం గమనార్హం. 'జనగణమన' పూరీకి డ్రీమ్ ప్రాజెక్ట్ అట. ఆ సినిమాకి సంబంధించి కథ కూడా పూరీ సిద్ధం చేసుకున్నారట. ఎప్పటికైనా ఆ సినిమాని తెరకెక్కిస్తాననీ ఆయన అంటున్నారు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే దేశభక్తికి సంబంధించిన కథని ఎలా సిద్ధం చేయగలను? అంటున్నారు పూరీ. ఈ సినిమాని త్వరలోనే తెరకెక్కిస్తాననీ ఆయన అంటున్నారు. 'పైసా వసూల్' సినిమాతో బిజీగా ఉన్న నన్ను, అనుకోకుండా ఈ డ్రగ్స్ ఇష్యూ చాలా బాధపెట్టిందని ఆయన అన్నారు. బాలకృష్ణతో పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తోన్న 'పైసా వసూల్' సినిమా ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.