సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్ ని చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
ఇదిలావుండగా, మహేష్-కొరటాల శివ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పైన విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ చిత్ర కథలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనుండడంతో ఈ ఆసక్తి మరింత పెరిగింది. ఈ తరుణంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ అలాగే శాటిలైట్ రైట్స్ కి తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది.
ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ స్టార్ మా ఛానల్ దక్కించుకోగా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ ని దక్కించుకుంది. ఈ రెండు రైట్స్ కలిపి సుమారు రూ 38 కోట్ల చెల్లించినట్టు తెలుస్తుంది. దీన్నిబట్టి ఈ సినిమాకి ప్రీ-రిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉండబోతున్నది అనే విషయం మనకి అర్ధమవుతుంది.
ఇక ఇంతటి క్రేజ్ ని మహేష్-కొరటాల నిలుపుకుంటారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొక మూడు నెలలు ఆగాల్సిందే..