మహేష్ - మురుగదాస్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా 'సంభవామి'. ఈ సినిమాలో తమిళ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే యంగ్ హీరో భరత్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. తెలుగులో భరత్ పరిచయం అక్కర్లేని నటుడే. 'బోయ్స్', 'యువసేన' సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తమిళంలో మంచి నటుడు భరత్. ఎలాంటి షేడ్ ఉన్న పాత్రనైనా అలవోకగా చేయగలడు. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినప్పటకీ, ప్రేక్షకులకి బాగా దగ్గరయిన పాత్రల్లో కనిపించాడు. అలాగే డబ్బింగ్ చిత్రాల ద్వారా కూడా భరత్‌కి తెలుగులో బాగా పాపులారిటీ ఉంది. చాలా కాలం తర్వాత మహేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మళ్లీ దగ్గర కానున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే భరత్‌ది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రనా? లేక హీరోకి సపోర్టింగ్ రోల్‌నా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ, సినిమాకి భరత్ పాత్ర అయితే కీలకం అంటున్నారు. ఈ సినిమాతో భరత్‌కి తెలుగులో మంచి బ్రేక్ రావడం పక్కా అంటున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత భరత్ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తానంటున్నాడు. అలాగే డైరెక్టర్ ఈ సినిమాతో విలన్‌గా పరిచయం కావడం మరో విశేషం. ఈ సినిమాతోనే మహేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.