పాన్ ఇండియా మూవీస్ ఒక్కొక్కటి ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. కల్కి ప్రభంజనం చూసిన జనం, నెక్స్ట్ విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 కోసం వెయిట్ చేస్తున్నారు. కల్కి లో కూడా కమల్ హాసన్ ఉన్నప్పటికీ పాత్ర నిడివి తక్కువ ఉంది. సెకండ్ పార్ట్ లో కమల్ విశ్వరూపం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు భారతీయుడు సినిమాతో అవినీతి పరులని శిక్షించే సేనాపతిగా కమల్ హాసన్ మళ్ళీ ప్రేక్షకులను అలరించ నున్నారు. దర్శకుడు శంకర్ ఏ సినిమా తీసినా అవినీతిని ప్రశ్నించే తత్వాన్ని, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని నేర్పిస్తాడు. సమాజంలో ఎంతో కొంత మార్పు వచ్చేలా ఆదర్శంగా తీర్చి దిద్దుతాడు తన పాత్రల తీరు తెన్నులను.
భారతీయుడు 2 కంటెంట్ కూడా సొసైటీలో పెరిగిపోయిన కరప్షన్ గురించి, అది ఏ స్థాయిలో జరుగుతోంది, దానికి సేనాపతి రియాక్షన్ శంకర్ చూపించబోతున్నాడు. జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో భారతీయుడు 2 బిజినెస్ ఆసక్తిగా మారింది. శంకర్ సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్, బాలీవుడ్ లలో కూడా మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య శంకర్ సినిమాలు ఐ, 2.ఓ డిజాస్టర్ అయిన కారణంగా డిస్టిబ్యూటర్స్ నష్టాలు చవి చూసారు. అందుకే భారతీయుడు 2 సినిమాకి బిజినెస్ అనుకున్నంతగా జరగలేదని, ఆంధ్రాలో 12 కోట్లు. సీడెడ్ లో 4 కోట్లు, నైజాంలో 9 కోట్ల బిజినెస్ జరిగినట్లు టాక్.
ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ లో 25 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తోంది. శంకర్ ఇమేజ్, కమల్ హాసన్ స్టార్ స్టేటస్ కి ఈ వసూళ్లు చాలా తక్కువ. కానీ తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీకి పెద్దగా టాక్ లేకపోవటం, ఈ మధ్య తమిళ సినిమాలు ప్లాఫ్ అవటం ఒక కారణం. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ లు కూడా ఆడియన్స్ లోకి పెద్దగా వెళ్ళలేదు . ఇలా రక రకాల కారణాలతో భారతీయుడు 2 బాక్సాఫీస్ దగ్గర 26 కోట్ల వసూళ్లు చేస్తే హిట్ అయినట్లు లెక్క అని విశ్లేషకుల అంచనా.