జనవరి 12న రావాల్సిన భీమ్లా నాయక్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా.. ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనకూడా వచ్చింది. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు బరిలో నిలిచాయి. వాటిలో భీమ్లా నాయక్ ఒకటి. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి, వాటికి స్పేస్ ఇవ్వాలని, అందుకే భీమ్లా నాయక్ ని వాయిదా వేయాలని ప్రయత్నాలు ఎప్టి నుంచో జరుగుతున్నాయి.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగి, భీమ్లానాయక్ నిర్మాతలకు సర్ది చెప్పారు. నిర్మాతలతో పాటుగా, పవన్ కల్యాణ్ కూడా సానుకూలంగా స్పందించడంతో... భీమ్లా నాయక్ ని వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సంక్రాంతికి భీమ్లా రావడం లేదు. కాబట్టి ఆర్.ఆర్.ఆర్కీ, రాధే శ్యామ్ కీ మధ్యనే పోటీ జరగబోతోంది. ఫిబ్రవరి 25న ఎఫ్ 3 రావాల్సివుంది. అయితే ఇప్పుడు ఆ సినిమాని ఏప్రిల్ 29కి వాయిదా వేశారు.