పవన్ కళ్యాణ్ మళ్ళీ రేసులోకి వచ్చారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈనెలలోనే 'భీమ్లా నాయక్'ని విడుదలలకు రంగం సిద్దం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధర సవరించాలని భావిస్తుంది. టికెట్టు ధరని తగ్గిస్తూ తెచ్చిన జీవోని ఈనెల 15న కొట్టేసి మళ్ళీ పాత జీవోనే అమల్లోకి తీసుకొచ్చే అవకాశం వుంది. దినితో పాటు నైట్ కర్ప్యు ని కూడా ఎత్తేసి థియేటర్ లో వంద శాతం ఆక్యుపెన్సీ ఇచ్చేలా చర్యలు తీసుకోవడానికి సిద్దమైయింది. ఇది కూడా ఈనెల 15నుంచి అమల్లోకి రావచ్చు. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాని ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించే అవకాశం వుంది.
భీమ్లా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. టైటిల్ సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలింది. రెండురోజుల్లో అదీ పూర్తవుతుంది. సినిమా విడుదలకు ముందు రెండు భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా పాటలు హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒక మ్యూజికల్ ఈవెంట్ పెట్టి తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలనేది నిర్మాతల ఆలోచన. మలయాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకుడు.