టాలీవుడ్ లో సాగుతున్న వరుస పరాజయాలకు బ్రేక్ వేశాడు నితిన్. సంక్రాంతి తరవాత తెలుగులో నిర్మాతలకు లాభాలు పంచిన సినిమా ఏదీ రాలేదు. భీష్మ ఆ లోటు తీర్చబోతోంది. ఎందుకంటే తొలిరోజు ఈ సినిమాకి దక్కిన ఆదరణ అలా వుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 5.5 కోట్లు సాధించి - సూపర్ ఓపెనింగ్ అందుకున్న భీష్మ.. రెండో రోజూ అదే జోరు కొనసాగించింది. 4.3 కోట్లు సాధించి - తన ఫామ్‌ని కొనసాగించింది.
రెండో రోజు నైజాంలో 1.9 కోట్లు, సీడెడ్‌లో 72 లక్షలు, వైజాగ్ లో 58 లక్షలు, గుంటూరులో 26 లక్షలు, ఈస్ట్‌లో 25.42 లక్షలు, వెస్ట్‌లో 15.5 లక్షలు, కృష్ణాలో 26 లక్షలు, నెల్లూరులో 10 లక్షలు తెచ్చుకుంది. రెండు రోజులకూ కలిపి 10.5 కోట్లు వచ్చినట్టైంది. ఆదివారం మరో 5 కోట్ల వరకూ వచ్చే అవకాశాలున్నాయి. నిర్మాతలకు విడుదలకు ముందే దాదాపు 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు సమాచారం. ఇప్పుడు బయ్యర్లకూ లాభాల పంట పండే అవకాశం ఉంది.