'ఛలో' డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ హీరోగా రాబోతున్న సినిమా 'భీష్మ'. అయితే ముందుగా ఈ సినిమాను క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని చూసింది చిత్రబృందం, ఆ మేరకు అధికారికంగా ప్రకటించింది కూడా. కానీ ఆ తరువాత రిలీజ్ మార్చారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా శివరాత్రికి స్పెషల్ గా రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఎలాగూ శివరాత్రికి పెద్ద సినిమాలు ఏవి లేవు.. సో బాక్సాఫీస్ వద్ద భీష్మకి పోటీ కూడా ఉండదు. ఇక ఇటివలే ఈ సినిమా కోసం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు.
ఈ చిత్రానికి 'సింగిల్ ఫరెవర్' అనేది ఉపశీర్షిక. 'ఛలో' మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ప్రజెంట్ తెలుగులో ఉన్న యువ కామెడియన్లలో వెన్నెల కిశోర్ బాగా పాపులర్. ఎలాంటి ఫన్నీ పాత్రనైనా అవలీలగా చేస్తూ హాస్యాన్ని పండించగలగడం వెన్నెల కిశోర్ స్పెషాలిటీ. అందుకే ఆయన కోసం పనిగట్టుకుని మరీ తమ సినిమాల్లో పాత్రలు రాస్తున్నారు దర్శకులు.
నితిన్ కూడా భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.