భీమా.... వ‌సూళ్లు ఓకేనా?!

మరిన్ని వార్తలు

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న గోపీచంద్ 'భీమా' గా గ‌త‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాకు డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. రివ్యూలు ఈ సినిమాని ఏకిప‌డేశాయి. గోపీచంద్ కు మ‌రో ప‌రాభ‌వం త‌ప్ప‌లేద‌ని డిక్లేర్ చేసేశాయి. అయితే అదృష్ట‌వ‌శాత్తూ వ‌సూళ్లు అంత బ్యాడ్ గా ఏం లేవు. ఓ యావ‌రేజ్ సినిమాకొచ్చే వ‌సూళ్లు భీమాకు క‌నిపించాయి. శివ‌రాత్రి రోజున ఈ సినిమా విడుద‌ల కావ‌డం ప్ల‌స్ అయ్యింది. ఆ రోజు నైట్ షోలు హోస్ ఫుల్ అవ్వ‌డం, అదే మూడ్... వీకెండ్ కొన‌సాడంతో భీమా కాస్త తేరుకోగ‌లిగింది. అయిన‌ప్ప‌టికీ.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వ‌లేదు. ప్ర‌తీ ఏరియాలోనూ క‌నీసం 30 శాతం న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది.


మ‌రోవైపు 'గామి' ప‌రిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఈ సినిమాకి మంచి రివ్యూలు వ‌చ్చాయి. వ‌సూళ్లూ బాగున్నాయి. త‌క్కువ బ‌డ్జెట్ తో ఈ సినిమాని రూపొందించ‌డం ప్ల‌స్ పాయింట్. దాంతో... త్వ‌ర‌గానే బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. ఓవ‌ర్సీస్‌లో భీమాతో పోలిస్తే గామి వ‌సూళ్లు మెరుగ్గా ఉన్నాయి. ఈవారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర‌కు మ‌రో అర‌డ‌జ‌ను సినిమాలొస్తున్నాయి. అయితే అవ‌న్నీ చిన్న సినిమాలే. కాబ‌ట్టి గామి, భీమా పుంజుకోవ‌డానికి ఈ వారాంతం కూడా కాస్త ఛాన్సుంది. మొత్తానికి గోపీచంద్ కు హిట్టు ద‌క్క‌లేదు కానీ, వ‌సూళ్ల ప‌రంగా గ‌త చిత్రాల‌తో పోలిస్తే కాస్త ఊర‌ట ల‌భించింద‌నే చెప్పాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS