చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆచార్య సినిమా ఇంకా రాకముందే... `గాడ్ ఫాదర్` షూటింగ్ మొదలెట్టారు. మొన్నటికి మొన్న బాబి సినిమాని పట్టాలెక్కించారు. ఇప్పుడు `భోళా శంకర్` వంతు వచ్చింది. తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం `వేదాళం`. ఈ చిత్రాన్ని తెలుగులో `భోళా శంకర్`గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా కథానాయిక. కీర్తి సురేష్ చిరు చెల్లాయిగా కనిపించనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, బి.గోపాల్, ఎన్.శంకర్, కొరటాల శివ, వి వి వినాయక్, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ, సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు.నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు.
ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దారు. అందులోనే ఈనెల 15 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే మహతి సాగర్ అదిరిపోయే ట్యూన్లు సెట్ చేశాడట. చిరంజీవి కెరీర్‌లోనే దీన్ని ఓ బెస్ట్ మూవీగా తెరకెక్కిస్తామని నిర్మాతలు చెబుతున్నారు.