డిటెక్టీవ్ కథలకు తెలుగులో మంచి గిరాకీ ఉంది. అప్పటి చంటబ్బాయ్ నుంచి మొన్నటి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వరకూ... ఎప్పుడు డిటెక్టీవ్ సినిమాలొచ్చినా ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఫన్, థ్రిల్.. కలగలిపిన ఎప్పుడు టిటెక్టీవ్ సినిమాలు తీసినా వసూళ్ల వర్షం కురిపించారు. ఇప్పుడు ఈ పరంపరలో మరో సినిమా వస్తోంది. అదే `భూతద్దం భాస్కర్ నారాయణ`. శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పురుషోత్తం రాజ్ దర్శకుడు. ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకొంది.
ఇదో మర్డర్ మిస్టరీ. 9వ నెల 9వ తేదీన 9 గంటలకు ఓ మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథని నడిపినట్టు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. టెక్నికల్ గా కూడా ఈ సినిమాని ప్రామిసింగ్ గా తెరకెక్కించారు. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు.
ఇదో డిటెక్టీవ్ మర్డర్ మిస్టరీ అయినా... దానికి మైథాలాజీ టచ్ ఇవ్వడంతో ఇంకాస్త కొత్తగా కనిపిస్తోంది. శివ కందుకూరి గెటప్ కూడా బాగుంది. ఈ పాత్రలో తను సరిగ్గా సూటైనట్టు కనిపిస్తున్నాడు. ఇది వరకు చూసీ చూడంగానే, మనుచరిత్ర, గమనం లాంటి చిత్రాలతో మంచి నటుడిగా నిరూపించుకొన్న శివ.. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ కూడా కొట్టేటట్టే కనిపిస్తున్నాడు.