త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎవరితో? ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఇదే. గుంటూరు కారం తరవాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? అనే సందిగ్థం అందరిలోనూ ఉంది. ఆఖరికి... త్రివిక్రమ్ లో కూడా ఇదే డౌట్.
నిజానికి గుంటూరు కారం తరవాత అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలి. అయితే దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు. అల్లు అర్జున్ దృష్టి బోయపాటి శ్రీను, అట్లీలపై ఉంది. పుష్ష 2 తరవాత వీళ్లలో ఒకరితో బన్నీ సినిమా సైట్స్‌పైకి వెళ్తుంది. ఆ తరవాతే త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. అంటే.. ఈలోగా త్రివిక్రమ్ మరో సినిమా చేయాలన్న మాట.
త్రివిక్రమ్ ముందు కూడా రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. రామ్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. నాని - వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రామ్ తో సోలో సినిమా కంటే, నాని - వెంకీతో మల్టీస్టారరే బెటర్. కానీ వెంకటేష్ మల్టీస్టారర్లు చేయడానికి ఇప్పుడు అంతగా సముఖంగా లేడని సమాచారం. ఒకవేళ వెంకీ తప్పుకొంటే ఆ స్థానంలో మరో హీరోని తీసుకోవాలి. అందుకోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. ఆ హీరో తేలేవరకూ త్రివిక్రమ్ తదుపరి సినిమాపై ఎలాంటి స్పష్టతా రానట్టే.