బిగ్ బాస్ అంటేనే సెలబ్రెటీల హవా. ఒకప్పుడు వెండి తెరని ఏలిన వాళ్లని తీసుకొచ్చి, ఈ షోని రక్తి కట్టించడానికి నిర్వాహకులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. బిగ్ బాస్ హిందీ వెర్షన్ అయితే... సూపర్ హిట్. ఈ రియాలిటీ షోలో సెలబ్రెటీలకూ, వివాదాలకూ ఎప్పుడూ కొదవ ఉండదు. త్వరలోనే బిగ్ బాస్ 15 సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్‌లో ఒకప్పటి కథానాయిక భూమిక ఠాకూర్ కనిపించబోతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై.. భూమిక స్పందించింది.
తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని, ఈ వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఇది వరకు తనకు బిగ్ బాస్ ఆఫర్లు చాలా వచ్చాయని, అయితే.. తాను అంగీకరించలేదని, అప్పటి నుంచి తనని సంప్రదించడమే మానేశారని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ సందేశం పంపింది భూమిక. ``బిగ్ బాస్ 1,2,3 సహా మరికొన్ని సీజన్లకు నాకు ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను ఒప్పుకోలేదు. భవిష్యత్తులో కూడా బిగ్ బాస్ కు వెళ్లే ప్రసక్తి లేదు. 24 గంటలు కెమెరాల ముందే ఉండటం నాకు ఇష్టం లేదు” అని క్లారిటీ ఇచ్చేసింది.