తమిళంలో మురుగదాస్ తిరుగులేని విజయాల్ని అందుకున్నాడు. గజినీని హిందీకి తీసుకెళ్లి అక్కడా సూపర్ హిట్ కొట్టాడు. తెలుగులోనే మురుగదాస్ సరైన ఫలితాల్ని అందుకోలేదు. అందుకే.. మురుగని మనవాళ్లు పెద్దగా నమ్మకడం లేదు. స్టాలిన్, స్పైడర్.. రెండూ ఫ్లాపులే కావడంతో, తెలుగు హీరోలు మురుగకి ఛాన్స్ లు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వెనకడుగు వేశాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ఫ`తో బిజీ. ఆ తరవాత... బన్నీ ఎవరితో సినిమా చేస్తాడన్న విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది.
బోయపాటి శ్రీను, వేణు శ్రీరామ్, ప్రశాంత్ నీల్ తో పాటుగా, మురుగదాస్ పేరు కూడా గట్టిగా వినిపించింది. గీతా ఆర్ట్స్ లో మురుగదాస్ ఓ సినిమా చేస్తాడని ఫిక్సయిపోయారు జనాలు. దానికి తగ్గట్టుగానే ఇటీవల బన్నీ - మురుగదాస్ లమధ్య కథా చర్చలు జరిగాయని సమాచారం. అయితే మురుగదాస్ చెప్పిన కథ బన్నీకి నచ్చలేదట. దాంతో ఏమాత్రం మొహమాటం లేకుండా `నో` చెప్పేశాడని టాక్. సో... బన్నీ దర్శకుల లిస్టు నుంచి.. మురుగదాస్ పేరు పక్కన పెట్టేసినట్టే. మరి బన్నీ తదుపరి సినిమా.. బోయపాటి తోనా? వేణు శ్రీరామ్ తోనా? లేదంటే.. ఈలోగా కొత్త దర్శకుడెవరైనా లైన్ లోకి వస్తాడా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.