బిగ్ బాస్ నుండి ఇంటికి వెళ్ళిపోయేది ఎవరో?

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మెల్లమెల్లగా తెలుగు వారి దృష్టిని తనవైపుకి తిప్పుకోలగుతున్నది. ఈ సీజన్ మొదలైన కొత్తలో అంతగా ఆదరణ లేకపోయినప్పటికీ ఈ షో మూడవ వారంలోకి వచ్చాక షోకి విపరీతమైన క్రేజ్ వస్తున్నది.

అది ఎంతలా అంటే.. బయట ఎక్కడ చూసినా కూడా ఈ షోకి సంబందించిన కార్చలే నడుస్తున్నాయి. టీవీలలో కూడా వీటి పైనే చర్చావేదికలు నిర్వహిస్తున్నాయి. ఇవ్వన్ని పక్కనేపెడితే ప్రతి ఆదివారం ఇంటి నుండి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అలా ఈరోజు ఎలిమినేషణ్ లో ముగ్గురు సభ్యులు ఉన్నారు.

అందులో ఒకరు నటుడు కిరీటి, నేపధ్య గాయిని గీతా మాధురి, జనసామాన్యం నుండి వచ్చిన గణేష్. ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఈ ముగ్గురిలో ఒకరు షో నుండి వెళ్ళిపోనున్నారు. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి బెట్టింగులు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తుంటే- హౌస్ లో గతవారం జరిగిన కొన్ని సంఘటనల కారణంగా నటుడు కిరీటి ఈరోజు హౌస్ నుండి నిష్క్రమిస్తాడు అని ఎక్కువమంది ఊహిస్తున్నారు. 

కాకపోతే బిగ్ బాస్ హౌస్ లో “ఏమైనా జరగోచ్చు” అనే ట్యాగ్ లైన్ ఉండటంతో అందరూ టెన్షన్ తో ఈరోజు ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.  మరి ఈ ముగ్గురిలో ఎవరు ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు? ఈ క్రింద కామెంట్ బాక్స్ లో మీరు ఊహించిన పేరు రాయండి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS