సంజు రెండు రోజుల్లో ఎంత రాబట్టాడో తెలుసా

By iQlikMovies - July 01, 2018 - 18:11 PM IST

మరిన్ని వార్తలు

సంజయ్ దత్ జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన చిత్రం సంజు. ఇప్పుడు దేశం మొత్తం ఈ సినిమా గురించి, సినిమాలో సంజయ్ దత్ గా నటించిన రన్బీర్ కపూర్ నటన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రానికి మొన్న ఉదయం షో నుండే పాజిటివ్ టాక్ రావడం మొదలైంది.

ఇక ఇంతటి ఆదరణ దక్కుతున్న ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. తొలిరోజు ఈ చిత్రానికి సుమారు రూ 35 కోట్లు రాగా రెండవ రోజు అయిన నిన్న రూ 39 కోట్లు వచ్చాయి. దీనితో రెండు రోజుల్లోనే రూ 74 కోట్లు కొల్లగొట్టింది. మూడవరోజు ఆదివారం కావడంతో ఈ వసూళ్ళు కచ్చితంగా రూ 100కోట్ల మార్క్ దాటేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. 

ఏదేమైనప్పటికీ ఈ చిత్రంతో రన్బీర్ కపూర్ కి తన కెరీర్ లోనే ఒక అతిపెద్ద కమర్షియల్ హిట్ కొట్టాడు అన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతున్నది. మూడురోజుల్లోనే రూ 100 కోట్ల మార్క్ దాటనున్న ఈ చిత్రం రూ 200 కోట్ల మార్కుని కూడా దాదాపు పది రోజుల లోపే దాటేస్తుంది అన్న విశ్లేషణలు నడుస్తున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS