బుల్లితెరపై గత నెల రోజులుగా ప్రసారమవుతున్న 'బిగ్‌బాస్' మొదట్లో డల్‌గా నడిచినప్పటికీ, ఇప్పుడు పుంజుకుంది. నవదీప్ ఎంట్రీ ఇచ్చినాక షోకి మరి కొంత జోష్ పెరిగింది. అలాగే దీక్షా పంథ్ వంటి ముద్దుగుమ్మల గ్లామర్ కూడా ఉండడంతో 'బిగ్‌బాస్' షో మొదట్లో కన్నా ఇంట్రెస్టింగ్‌గానే సాగుతోంది. తొలి రెండు, మూడు వారాలు వీక్ డేస్ అన్నీ డల్‌గా సాగి, వీకెండ్స్ వచ్చేసరికి ఎన్టీఆర్ ప్రెజెన్స్‌తో జోష్ వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. వీక్ డేస్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటోంది ఈ షో. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటున్నాయి. హౌస్ మేట్స్ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. గ్లామర్‌గానూ కనిపిస్తున్నారు. మొదట్లో డ్రస్ సెన్స్, స్క్రీన్ అప్పియరెన్స్ తదితర అంశాలు హౌస్ మేట్స్ డల్‌గా ఉండడంతో, వీక్ డేస్‌లో బోరింగ్‌గా అనిపించేది 'బిగ్‌బాస్' షో. కానీ ఇప్పుడలా కాదు. ఈ రోజు ఏం టాస్క్ చేయబోతున్నారా? ఏ కాస్ట్యూమ్స్‌లో కనిపించబోతున్నారా? అంటూ క్యూరియాసిటీ కనిపిస్తోంది ఆడియన్స్‌లో. సో ఆ రకంగా ఈ 'బిగ్‌బాస్' షో ప్రస్తుతం సక్సెస్ బాట పట్టినట్లే అనిపిస్తోంది. వీకెండ్ రానే వచ్చింది. ఈ వీకెండ్‌లో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అన్నట్లు ఈ షోకి గత వారంలో రానా గెస్ట్‌గా వచ్చి, హౌస్ మేట్స్‌నీ ఆనందపరచి, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు. ఈ వారంలో హీరోయిన్ తాప్సీ గెస్ట్‌గా వచ్చి, హౌస్ మేట్స్‌ని ఆశ్చర్యపరిచింది. తాప్సీ హౌస్ మేట్స్ అందర్నీ సరదాగా ఇంటర్వ్యూ చేసింది. కొన్ని కొన్ని టాస్క్‌లు ఇచ్చి, ఫుల్ జోష్ తీసుకొచ్చింది.