అలనాటి అందాల తార శ్రీదేవి వయసు యాభయ్యేళ్ళని చెబితే ఎవరైనా నమ్మగలరా? ఈ ఫొటో చూస్తే అస్సలు నమ్మలేరు. అదే శ్రీదేవి ప్రత్యేకత. వయసు మీద పడుతున్న కొద్దీ శ్రీదేవి అందం మరింతగా పెరిగిపోతూ వస్తోంది. అయితే వెండితెరపై రీ-ఎంట్రీలో వయసుకు తగ్గ పాత్రల్ని ఎంచుకుంటూ ఆమె ప్రదర్శిస్తున్న హుందాతనానికి హేట్సాఫ్. ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్ ఇప్పటికీ అదే గ్లామర్‌ని మెయిన్‌టెయిన్ చేయడమంటే చాలా గ్రేట్. అందుకే 'మామ్' సినిమాలో నటించినా, శ్రీదేవిని ఇంకా అందాల సుందరి అనే చెప్పుకుంటున్నాం. 'మామ్' శ్రీదేవి అనేందుకు ఎవరూ సాహసించరు.