'బిగ్‌బాస్‌ 2' ఆ ముగ్గురిలా ఈ ముగ్గురూ.!

By iQlikMovies - June 12, 2018 - 18:46 PM IST

మరిన్ని వార్తలు

తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న మెగా గేమ్‌ షో 'బిగ్‌బాస్‌ 2' ఇంకా ఆడియన్స్‌కి అలవాటు కావాల్సి ఉంది. 'బిగ్‌బాస్‌' మొదటి సీజన్‌కి సంబంధించి, ముమైత్‌ ఖాన్‌, శివబాలాజీ, ఆదర్శ్‌, హరితేజ, అర్చన, కమెడియన్‌ ధన్‌రాజ్‌, నవదీప్‌ తదితరులు పాపులారిటీ ఉన్న ఆర్టిస్టులు. కానీ ఈ సీజన్‌లో ఫాపులర్‌ ఫేసెస్‌ అంటే అంతగా కనిపించడం లేదు.

ఉన్నంతలో అమిత్‌, యాంకర్‌ శ్యామల, కౌషల్‌ ఈ ముగ్గురూ కొంచెం మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నారు. ఆ రకంగా గత సీజన్‌లో హరితేజ, శివబాలాజీ, ఆదర్శ్‌ క్యారెక్టర్స్‌ని, వరుసగా శ్యామల, కౌషల్‌, అమిత్‌లు రీ ప్లేస్‌ చేస్తారేమో అనిపిస్తోంది. గ్లామర్‌ విషయానికి వస్తే, లాస్ట్‌ సీజన్‌లో ముమైత్‌ఖాన్‌, దీక్షా,అర్చన వీరి నుండి గ్లామర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశాం.

కానీ ఈ సారి అలా కాదు, గ్లామర్‌కి పెద్దగా లోటేం లేదనిపిస్తోంది. లేడీ కంటెస్టెంట్స్‌లో శ్యామల, గీతా మాధురి తదితర సెలబ్రిటీస్‌ని పక్కన పెడితే, సామాన్యులుగా వచ్చిన ముద్దుగుమ్మలు సెలబ్రిటీస్‌తో పోల్చితే, గ్లామర్‌లో తామేం తక్కువ కాదని పరిచయంతోనే నిరూపించేశారు. అయితే ఇంట్రడక్షన్‌ అప్పీల్‌కీ, షోలో అప్పియరెన్స్‌కీ చాలా ఛేంజ్‌ ఉంటుంది.

చూడాలి మరి, గ్లామర్‌తో, వారి టాలెంట్‌తో ఎవరెవరు 'బిగ్‌బాస్‌ 2' షోని రక్తి కట్టిస్తారో. ఇకపోతే, స్టార్‌డమ్‌ని పక్కన పెట్టేసి, హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్‌ మాత్రం తొలి సీజన్‌లో టీఆర్‌పీ రేటింగ్స్‌ని బీభత్సంగా పెంచేశాడు. మరి ఆ స్థానాన్ని ఈ సీజన్‌లో హోస్ట్‌గా నాని ఎలా రీప్లేస్‌ చేస్తాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS