గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నేచురల్ స్టార్ నాని, నటి శ్రీ రెడ్డి కి మధ్య పెద్ద వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాని నిన్న శ్రీ రెడ్డి కి లీగల్ నోటీసులు పంపాడు. అయితే ఈ క్రమంలో నాని తో పాటు ఆయన భార్య అంజన కూడా ఎంట్రీ ఇవ్వటం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. 'సినీ పరిశ్రమ చాలా దయాగుణంతో కూడుకుని ఉంటుంది. పబ్లిసిటీ కోసం వేరొకరి జీవితాలతో ఆడుకుంటున్న కొందరు సినీ పరిశ్రమ లోకి వస్తుండటం నన్ను ఇబ్బందికి గురి చేస్తుంది. అయితే వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవరూ పట్టించుకోరు. కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని అంత కింద స్థాయికి దిగజార్చుకోవడానికి ఎలా సిద్ధపడతారో వాళ్ళకే తెలియాలి' అంటూ సంచలన పోస్ట్ చేసింది.
అంతేకాకుండా దానికి నాని కేసు పెట్టిన పోస్ట్ ని జత జేసింది అంజన. దీనికి దీటుగా నాని రియాక్షన్ కోసం వేచి చూస్తున్న శ్రీ రెడ్డి తనకు కావాల్సింది కూడా ఇదేనని, నీ బండారం బయటపెట్టటానికి మంచి అవకాశం దొరికిందని.. 'కచ్చితంగా లీగల్ ఫైట్ చేద్దాం.. సై' అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చింది.