బిగ్‌హౌస్‌లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. హౌస్‌లో అందరూ నిద్రించిన వేళ అలీ రెజా, పునర్నవి హౌస్ నుండి మాయమైపోయారు. అది గమనించిన హౌస్మేట్స్ కాసేపు ఆందోళన పడ్డా, తర్వాత తేరుకుని ఆ సంగతి పక్కన పెట్టేశారు. అయితే, కాసేపటికి బిగ్‌బాస్ వారికి ఊహించని టెస్ట్ పెట్టారు. మాయమైన ఆ ఇద్దరూ హౌస్‌లోకి తిరిగి రావాలంటే, కొన్ని త్యాగాలు చేయాలని సూచించారు. అందుకు హౌస్ మేట్స్ సిద్ధమే అని సంకేతమిచ్చారు. ఆ సేక్రిఫైసెస్లో భాగంగా మొదటిగా ఫుట్ వేర్ని అవైడ్ చేయమని బిగ్‌బాస్ సూచించారు.
ఆ తర్వాత వారం రోజులపాటు పెరుగును బంద్ చేయాలని చెప్పారు. ఆ రెండింటికీ కొంతమంది అప్పోజ్ చేసినా, ఓవరాల్‌గా ఓకే అన్నారు. కానీ, ఆ తర్వాతి సేక్రిఫైస్ విషయంలో మాత్రం హౌస్ మేట్స్ సందిగ్ధంలో పడ్డారు. నలుగురు మేల్ హౌస్ మేట్స్‌కి సంబంధించిన బ్లాంకెట్స్, గుడ్లు, మరియు పాలు తదితర కొన్ని ఫుడ్ ఐటెమ్స్ కూడా స్టోర్ రూమ్‌లో పెట్టేయాలని బిగ్‌బాస్ సూచించారు.
దాంతో హౌస్మేట్స్ టోటల్‌గా ముందు ఓకే చేసిన శాక్రిఫైస్లకు కూడా చేతులెత్తేసినట్లుగా కనిపించారు. ఈ తాజా ట్విస్ట్‌కి ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యారు. ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ నియమాల్ని ఉల్లంఘించినందుకు గడువు తీరకుండానే, ఈ వారం వరుణ్ సందేశ్ తన కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు అసలు కారణాలేంటో తెలియాలంటే, స్టే ట్యూన్డ్.. లెట్స్ వెయిట్ ఫర్ బిగ్‌బాస్ నెక్ట్స్ హాట్ న్యూస్