ఓవర్సీస్‌లో దుమ్ము రేపనున్న రెండో 'మన్మధుడు'!

మరిన్ని వార్తలు

నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న 'మన్మధుడు 2' ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బజ్‌ బాగా ఉంది. కంటెంట్‌ పరంగా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు. హాట్‌ కంటెంట్‌ కూడా ఉండడంతో సినిమాకి ఓవర్సీస్‌లో కూడా బజ్‌ బాగా ఏర్పడింది. అంతేకాదు, ఓవర్సీస్‌లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రమోట్‌ చేయనున్నాడట మన్మధుడు. 'మన్మధుడు 2' ప్రీమియర్‌ని అక్కడే చూడబోతున్నాడట. ఓ పక్క బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తూనే నాగార్జున 'మన్మధుడు 2' ప్రమోషన్స్‌లోనూ హుషారుగా పాల్గొంటున్నాడు.

 

ఆల్రెడీ చైతూ, సమంత నటించిన 'మజిలీ', సమంత 'ఓ బేబీ' చిత్రాలు ఓవర్సీస్‌లో మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. మంచి వసూళ్లు కూడా రాబట్టాయి. వాళ్లను బీట్‌ చేసేలా ఓవర్సీస్‌ని టార్గెట్‌ చేస్తానంటున్నాడు మన్మధుడు. ఈ సినిమాకి హిట్‌ పక్కా అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఆధ్యంతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారనీ, నాది గ్యారంటీ అని సోగ్గాడు భలే హుషారుగా చెప్పేస్తున్నాడు.

 

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా తర్వాత నాగార్జున ఆ స్థాయిలో ఈ సినిమా గురించి చెబుతుండడం విశేషం. అంటే, 'సోగ్గాడు' మాదిరి ఈ సినిమా కూడా నాగ్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌ ఫిలింగా నిలిచిపోనుందేమో చూడాలిక. 'చిలసౌ' ఫేం రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటించగా, కీర్తిసురేష్‌, సమంత గెస్ట్‌ రోల్స్‌లో కనిపించనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS