బిబి 3 ఫైనల్‌ వర్డిక్ట్‌: ఆడియన్స్‌ వెర్సస్‌ బిగ్‌బాస్‌!

మరిన్ని వార్తలు

గత నూరు రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3 క్లైమాక్స్‌కి చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు సీజన్స్‌తో పోల్చితే, ఈ సీజన్‌ కాస్త డల్‌గా సాగిందనే టాక్‌ నడిచినా, ఎంతైనా క్లైమాక్స్‌లో ఉత్కంఠ సహజమే. ఈ రోజు, రేపు అనగా ఈ వీకెండ్‌తో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ముగిసిపోనుంది. టాప్‌ 5లో నిలిచిన ఐదుగురు కంటెస్టెంట్స్‌లో టైటిల్‌ ఎవరిది.? అనే ప్రశ్నకు కొందరి వద్ద సమాధానమున్నా, కన్‌పర్మేషన్‌ లేదు కదా. ఓటింగ్‌ అయితే ముగిసిపోయింది. ఓటింగ్‌ ప్యాటర్న్‌ని బట్టి చూస్తే, వరుణ్‌, రాహుల్‌, శ్రీముఖి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

చాలా తక్కువ ఓట్ల డిఫరెన్స్‌లో ఈ ముగ్గురూ బరిలో నిలుచున్నారు. టాప్‌ 5లో ఉన్న అలీ రెజా ఐదో స్థానంలో ఉండగా, బాబా భాస్కర్‌ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. పైన చెప్పుకున్న ముగ్గురూ మొదటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అయితే, ఆడియన్స్‌ నుండి తీర్పు వచ్చేసింది కానీ, ఎవరిది మొదటి స్థానం అనేది మాత్రం బిగ్‌బాస్‌ ప్రకటించాల్సిందే. గత రెండు సీజన్స్‌లో మేల్‌ కంటెస్టెంట్స్‌నే బిగ్‌బాస్‌ ట్రోఫీ వరించింది. సో ఈ సారి కొంచెం భిన్నంగా ఫిమేల్‌ కంటెస్టెంట్‌కి ఆ ట్రోఫీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బిగ్‌బాస్‌ టీమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆడియన్స్‌ తీర్పు నిజమవుతుందా.? లేక బిగ్‌బాస్‌ సొంత నిర్ణయం ఫలిస్తుందా.? చూడాలంటే మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS