కండలున్నాయి కదా.. అని ప్రదర్శించేస్తే, గ్లామర్ ఉంది కదా.. అని ఎప్పుడూ చొక్కా విప్పుకు తిరిగితే సరిపోదు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండాలి. అంతే కాదు, కొన్ని చోట్ల మానవత్వం కూడా ప్రదర్శించాలి. అలీ రెజాకి ఫాలోయింగ్ బీభత్సంగా ఉన్నప్పటికీ, అతి ఎగ్రెసివ్‌నెస్ మైనస్‌గా మారిపోయింది. అందగాడు.. మంచి ఫిట్ బాడీ ఉంది. తనవంతు ఎంటర్‌టైన్ చేయగలడు.. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఖాతాలో వేసినా, ఒకసారి ఎలిమినేట్ అయ్యి రావడం టైటిల్‌కి అలీ అర్హుడు కాదు.. అనేందుకు ఓ పెద్ద రీజన్. అంతేకాదు, బాబా భాస్కర్‌తో ఓ టాస్క్‌లో అత్యుత్సాహం ప్రదర్శించాడు.
సాటి కంటెస్టెంట్ అనే విషయం మర్చిపోయి, హీరోలా ఫీలైపోయాడు. చిన్నపాటి యాక్షన్ సీన్ చూపించేశాడు. డిచ్ ఫైట్లు చేసేశాడు. బాబాని ఫిజికల్‌గా గాయపరచాలనుకున్నాడు. అక్కడితో అలీ గ్రాఫ్ పడిపోయింది. కానీ, మొదట్నుంచీ టాస్క్‌ల్లో అలీ వీరత్వమే ప్రదర్శించాడు. ఆ కారణంగా కొంత కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నా, టాస్క్‌ల వీరుడు అనే టైటిల్ అలీకే దక్కుతుందనడం అతిశయోక్తి కాదేమో. శివజ్యోతితో రిలేషనషిప్ కారణంగా చాలాసార్లు ఇరకాటంలో పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే, అలీకి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, గెలుపు అవకాశాలు మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోల్చితే తక్కువే అని చెప్పాలి. కానీ, టాప్ 5 వరకూ చేరడం అలీరెజా అదృష్టమే అని చెప్పాలి.