బిగ్‌బాస్‌లో గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన తప్పిదాలకు కారణమైన వారికి బిగ్‌బాస్ శిక్ష విధించారు. మొదటిగా కెప్టెన్ అయిన వరుణ్‌తేజ్, కెప్టెన్సీని సద్వినియోగం చేసుకోని కారణంగా, హౌస్ మేట్స్‌లో ఎవ్వరు బయటికి, లోపలికి వెళ్లాలన్నా, డోర్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత వరుణ్‌దేనంటూ పనిష్‌మెంట్ ఇచ్చారు. ఇక మైక్ ధరించని కారణంగా తమన్నా, ఆషు రెడ్డి, హిమజ తదితరులకు పూల్‌లో డిప్ చేసే శిక్ష విధించారు.
బిగ్‌బాస్ నుండి ఎప్పుడు ఏ అనౌన్స్‌మెంట్ వచ్చినా, ఇమీడియట్‌గా వీరు పూల్‌లో మునిగి రావల్సి వచ్చింది. ఈ తతంగం చూసే ఆడియన్స్‌కి మంచి ఫన్ క్రియేట్ చేసింది. కానీ, తర్వాత వరుసగా మునకలేసి వచ్చేసరికి వారికి చుక్కలు కనబడ్డాయి. అసలు సిసలు ఫన్ ఫనిష్‌మెంట్ మహేష్, శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, అలీ తదితరులకు ఇచ్చాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలో ఉంచిన రెండు కన్నాలున్న పెద్ద నీటి డ్రమ్ములను, ఆ కన్నాల్లో వేలిని ఉంచి, నీటిని అదుపు చేసే ఫనిష్‌మెంట్ అది, చూడ్డానికి చాలా ఫన్నీగా అనిపించాయి ఈ పనిష్‌మెంట్. కానీ, పూర్తి చేసేసరికి హౌస్‌మేట్స్‌కి దూల తీరినంత పనైంది.
ఈ పనిష్‌మెంట్స్‌కి ముందు, ఇన్ని రోజులూ హౌస్‌లో జ్ఞాపకాలు అంటూ బిగ్‌బాస్ టీవీలో కొన్ని క్లిప్పింగ్స్ వేసి చూపించారు. ఆ క్లిప్పింగ్స్‌ని ఎంజాయ్ చేశారు హౌస్‌మేట్స్. ఎందుకు వాటిని బిగ్‌బాస్ చూపించారో పనిష్‌మెంట్స్ తీసుకున్నాక కానీ అర్ధం కాలేదు పాపం హౌస్‌మేట్స్‌కి. అవి జ్ఞాపకాలు కాదు, హౌస్ నియమాల ఉలంఘనలు అని అప్పుడు అర్ధమైంది హౌస్‌మేట్స్‌కి అదీ సంగతి. అలా తాజా ఎపిసోడ్ ఫస్ అండ్ ఫ్రస్టేషన్‌తో వెంకీ, వరుణ్ 'ఎఫ్ 2'ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచింది.