బిగ్‌బాస్ రియాల్టీ షోలో గతంలో కూడా ఓ కంటెస్టెంట్, తాను హౌస్‌లో వుండలేను మొర్రో.. అంటూ గుస్సా అయ్యాడు. హోస్ట్ నాగార్జున, క్లాస్ పీకి మరీ అతన్ని హౌస్‌లో వుంచాడు. అతనెవరో కాదు, రాహుల్ సిప్లిగంజ్. చివరికి రాహుల్, సీజన్ విన్నర్‌గా నిలిచిన విషయం విదితమే. ఇక, సంపూర్ణేష్ అయితే హౌస్‌లో వాతావరణం తనకు అస్సలు పడటంలేదంటూ గగ్గోలు పెట్టడంతో చేసేది లేక అతన్ని బయటకు పంపించారు నిర్వాహకులు. ఇప్పుడిక అవే కాపీ సన్నివేశాలు బిగ్‌హౌస్‌లో కనిపిస్తున్నాయి.
రాహుల్ తరహాలో నోయెల్ సీన్ చుట్టూ సీన్స్ నడుస్తున్నాయి. రాహుల్, నోయెల్ మంచి స్నేహితులు. రాహుల్‌లానే నోయెల్ కూడా సింగర్ కావడం మరో ఆసక్తికర అంశం. ఇక, సంపూర్ణేష్‌ని గంగవ్వతో పోల్చవచ్చేమో. సంపూలానే గంగవ్వ కూడా హౌస్‌లో వుండలేకపోతున్నానంటోంది. ఆమెని కూడా రేపో మాపో హౌస్ నుంచి అర్థాంతరంగా పంపించేయొచ్చు.
నోయెల్‌కి ఈ రోజు కింగ్ నాగ్ గట్టిగా క్లాస పీకడమే నిజమైతే, మొత్తం సీజన్ అంతా ‘కాపీ’ తరహాలోనే నడుస్తోందని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ సీజన్‌లో జరుగుతున్న పరిణామాలేవీ ‘రియల్‌గా’ అనిపించడంలేదు. అంతా డ్రమెటిక్‌గానే నడుస్తోంది. మోనాల్ - అబి - అఖిల్‌ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సహా. ఆ లవ్ స్టోరీ వెగటు పుట్టించేసింది ఆడియన్స్‌కి. వున్నపళంగా బిగ్‌బాస్, కొత్తదనం వైపు మొగ్గు చూపాలి. లేకపోతే అంతే సంగతులు.