ఈ ఇన్నింగ్స్ లో దూకుడు చూపిస్తున్నారు మెగాస్టార్. ఆచార్య చేతిలో ఉండగానే... మరో ముగ్గురు దర్శకులకు ఓకే చెప్పారు. ఏ సినిమా ముందు, ఏ సినిమా వెనక్కో స్పష్టత లేదు గానీ, ముగ్గురు దర్శకులూ కథలు రెడీ చేసుకోవడంలో తలమునకలైపోయి ఉన్నారు. ఇప్పుడు మరో దర్శకుడు కూడా చిరు కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తనే మురుగదాస్. మురుగదాస్ తో ఇది వరకు `స్టాలిన్` సినిమా చేశాడు చిరు.
అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. చిరుకి హిట్ ఇవ్వలేకపోయానన్న అసంతృప్తి మురుగదాస్ లో ఉంది. అందుకే చిరుతో ఓ సినిమా చేయడానికి మురుగదాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చిరు కూడా మురుగదాస్ తో మరోసారి పనిచేయడానికి ఉత్సాహంగానే ఉన్నాడట. అయితే ఈసారి పూర్తి కమర్షియల్ సినిమా తీయాలని, సోషల్ మెసేజీ జోలికి పోకూడదని చిరు భావిస్తున్నాడట. అలాంటి కథే... మురుగదాస్ దగ్గర ఉందట.
తెలుగులో మురుగదాస్ చేసిన రెండు సినిమాలూ ఫ్లాపే. అందుకే.. తెలుగులో ఈసారి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చిరు ఓకే అంటే మురుగదాస్‌కి ఓ మార్గం దొరికినట్టే.