బిగ్‌బాస్ హౌస్‌లో అవసరమైనంత ‘కార్చిచ్చు’ రగిల్చేశాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. ‘హీరో - జీరో’ కాన్సెప్ట్ మాత్రమే కాదు, డబుల్ ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా హౌస్‌లో వాతావరణాన్ని హీటెక్కించేసింది. ఫేక్ ఎలిమినేషన్ ద్వారా టెన్షన్ పెంచేసిన కింగ్ నాగ్, తద్వారా హారికకి హౌస్‌లో ‘యాంటీ గ్యాంగ్’ ఎవరన్నదీ అర్థమయ్యేలా చేసేశాడు. మెహబూబ్, అఖిల్, సుజాతల్ని అలేఖ్య హారిక టార్గెట్ చేసేసినట్లే కనిపిస్తోంది.
అదొక్కటే కాదు, ఇకపై ఎవరూ సెల్ప్ నామినేట్ చేసుకోకుండా బిగ్ హోస్ట్ నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లయ్యింది ఈ ఫేక్ ఎలిమినేషన్ ద్వారా. మరోపక్క, హౌస్‌లో దేవి వర్సెస్ అమ్మ రాజశేఖర్ పోరు మరింత రసవత్తరంగా మారబోతోంది. అమ్మ రాజశేఖర్, ఇకపై లాస్యని కూడా ‘సీరియస్ విలన్’గా పరిగణించనున్నాడు. మరోపక్క, దివి వర్సెస్ లాస్య ‘ఫైట్’ కూడా హౌస్‌లో హీట్‌ని పెంచేయబోతోంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తర్వాత కూడా హౌస్‌లో సీరియస్‌నెస్ కనిపించలేదుగానీ.. ఇక ఇప్పుడు రెండో వీకెండ్ తర్వాత మాత్రం సీన్ కంప్లీట్‌గా మారిపోబోతోంది.
నామినేషన్ ప్రక్రియ సందర్భంగానే ఈ హీట్ కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. హౌస్‌లో ఎవరూ తక్కువ కాదు. కంటెస్టెంట్స్‌ని అంత సెలక్టివ్‌గా ఎంపిక చేశారు మరి. సో, గత సీజన్లకు భిన్నంగా మరింత ‘హీటెడ్ ఆర్గ్యుమెంట్స్’ ఈ నాలుగో సీజన్‌లో వుండబోతున్నాయనీ, అందరూ కారాలూ మిరియాలూ నూరేయడం ఖాయమనీ భావించొచ్చేమో.