బిగ్‌బాస్ రియాల్టీ షోకి సంబంధించి కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వస్తూనే వుంటాయి. ఆ షోకి వున్న క్రేజ్ అలాంటిది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ గాసిప్స్ నిజమవడం కూడా చూస్తున్నాం. తొలివారం సూర్యకిరణ్ ఎలిమినేషన్ అందరూ ఊహించిందే. కంటెస్టెంట్స్‌గా ఎవరొస్తారని కొన్ని నెలల ముందే చాలామంది ఊహించారు.. ఆ అంచనాలకు తగ్గట్టే కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు తాజాగా డబుల్ ఎలిమినేషన్ అనే చర్చ సాగుతోంది. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ వుందనీ, ఇద్దరూ మహిళలే ఎలిమినేట్ అయ్యే అవకాశం వుందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ లిస్ట్‌లో కళ్యాణి పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వస్తుండగా, మరో మహిళా కంటెస్టెంట్ ఎవరు? అన్నది చర్చనీయాంశంగా మారింది. బోల్డంత ఫాలోయింగ్ గంగవ్వకి వున్నప్పటికీ కూడా, ఆమె వయసు రీత్యా ఎక్కువ రోజులు బిగ్‌హౌస్‌లో వుండడం కష్టమని అంటున్నారు. నిన్న పడవ టాస్క్ సందర్భంగా గంగవ్వ ఎక్కువ సేపు బోట్‌లో కూర్చోలేకపోయిన విషయం విదితమే. బోటు కిందకి దిగాక, కొంత ఇబ్బంది పడింది గంగవ్వ.
‘నేను కాళ్ళు పట్టనా.?’ అంటూ లాస్య, గంగవ్వని అడిగింది కూడా. ఇదిలా వుంటే, గంగవ్వ.. ‘నేను హౌస్‌లో వుండలేకపోతున్నాను..’ అంటూ హోస్ట్ నాగార్జునకి చెప్పగా, ‘వుండలా.? వద్దా? అనేది ఓటింగ్ తేల్చతుంది’ అని చెప్పాడు. ఇక, ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయినవారిలో కళ్యాణి, గంగవ్వ వున్న విషయం తెలిసిందే కదా. ఈ ఇద్దరూ డబుల్ ఎలిమినేట్ అవుతారా? వేచి చూడాలిక.