తెలుగునాట మల్టీస్టారర్ల హవా ఎక్కువ అవుతోంది. చిన్నా, పెద్దా అనే తేడాలేదు. జూనియర్ సీనియర్ అనే బేధం లేదు. ఇద్దరుహీరోలు కలిసి పనిచేయడానికి ఎవరెడీ. అలాంటి కథలకు మంచి డిమాండ్ ఉందిప్పుడు. అందుకే.. మల్టీస్టారర్లు వరుస కడుతున్నాయి. టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ సినిమా రావడానికి ఓ బీజం పడిందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈసారి రానా, నాని కలిసి పనిచేయబోతున్నార్ట. ఇద్దరూ మంచి స్నేహితులు. ప్రయోగాలకు ఇద్దరూ సిద్ధమే. అందుకే ఈసారి ఇద్దరూ జత కట్టడానికి రెడీ అయ్యార్ట. ప్రస్తుతం సురేష్ బాబు వీరిద్దరి కోసం ఓ కథ ని రెడీ చేయిస్తున్నారని సమాచారం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు పైప్ లైన్ లోనే ఉన్నా, తప్పకుండా ఏదో ఓ రోజు కార్యరూపం దాల్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్ టాక్. కాకపోతే... నాని, రానా చేతుల్లో బోలెడన్ని సినిమాలున్నాయి. అవన్నీ ఓ కొలిక్కి రావాలి. ఈ లోగా కథ రెడీ అవ్వాలి. అందుకు చాలా సమయం పడుతుంది.