బిగ్ బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్‌లో మునుపటి సీజన్ల కంటే భిన్నంగా కంటెస్టెంట్స్ ప్రవర్తన కన్పిస్తోంది. ఎవరికి వారే ఓవరాక్షన్‌లో తమ సత్తా చాటేస్తున్నారు. కొందరేమో ఏడుపుతో ‘సెంటిమెంట్’ కొల్లగొట్టేయాలనుకుంటున్నారు. ఇంకొందరేమో లేని ‘ఈజ్’ని ప్రదర్శించేందుకు పాట్లు పడుతున్నారు. అర్థం పర్థం లేని గొడవలు కొందరు సృష్టిస్తోంటే, ఆ గొడవల్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంకొందరు నటించేస్తున్నారు. ‘రియాల్టీ’ అన్నది మచ్చుకైనా కన్పించని ఈ రియాల్టీ షోలో ఎవరికి వారే ‘మేమే నెంబర్ వన్’ అన్నట్లు బిహేవ్ చేస్తుండడం బుల్లితెర వీక్షకులకు షాకిస్తోంది.
గంగవ్వ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. టైమ్ దొరికితే ఎవర్నీ వదలడంలేదు, సెటైర్లతో ఆడేసుకుంటోంది. అయితే, ఎక్కువగా ఆమెను ప్రోమోల కోసమే వాడుతున్నారు. ఆమెకు అవసరమైన మేర మాత్రం స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు నిర్వాహకులు. మిగతా వాళ్ళ పరిస్థితి చాలా భిన్నంగా వుంటోంది. ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు బుల్లితెర వీక్షకులకి. దాంతో, చాలామందిపై ‘నెగెటివ్ వ్యూ’ పడిపోతోంది. సీజన్ ప్రారంభమై కొద్ది రోజులే గడిచిన నేపథ్యంలో అప్పుడే ఎవర్నీ జడ్జ్ చేయలేం. కానీ, కంటెస్టెంట్స్ అత్యుత్సాహం కాస్తా బిగ్‌బాస్ వ్యూయర్ షిప్‌ని దెబ్బకొట్టేలా వుంది.
అందరిలోనూ ఎనర్జీ వుంది, దాన్ని ఇంతవరకూ సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు బిగ్‌బాస్. చూస్తుండగానే వీకెండ్ మళ్ళీ వచ్చేస్తోంది. ఎవరో ఒకరు హౌస్ నుంచి ఎవిక్ట్ అవక తప్పదు. అదెవరన్నదానిపై నెటిజన్లలో రకరకాల అభిప్రాయాలున్నాయ్. కానీ, ఓవరాల్‌గా హౌస్ మీద రేటింగ్స్ మాత్రం చాలా డల్‌గా కనిపిస్తున్నాయి.