ఇటీవలే నాగార్జున సెట్లో అడుగుపెట్టారు. నాగచైతన్య కూడా అదే దారిలో వెళ్లాడు. మహేష్ బాబు సైతం.. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం సెట్లోకి వచ్చేశాడు. ఇప్పుడు చిరంజీవి కూడా షూటింగులకు సై అనబోతున్నాడని టాక్. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య`. కాజల్ కథానాయికగా నటిస్తోంది. లాక్ డౌన్ మూలంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించక ముందే... ఆచార్య షూటింగ్‌ని ఆపేశారు.
ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి చిత్రబృందం రెడీ అవుతోంది. అక్టోబరులో `ఆచార్య` షూటింగ్ మొదలు కానున్నదని సమాచారం. తొలుత రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తార్ట. ఆ తరవాత.. చిరంజీవి సెట్లో అడుగుపెడతారట. ఇప్పటి వరకూ చరణ్ పక్కన నటించే కథానాయిక ఎవరన్న విషయంలో క్లారిటీ రాలేదు. త్వరలోనే తననీ ఎంపిక చేసేస్తే.. `ఆచార్య` షూటింగ్ కి లైన్ క్లియర్ అయినట్టే. 2021 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.