ఓట్ల పరంగా చూసుకుంటే, అబిజీత్ గెలుపుకి అడ్డంకి లేదు. కానీ, అబిజీత్ అభిమానుల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది. 'ఈసారి టైటిల్ ఖచ్చితంగా అమ్మాయికే.. అలా చూస్తే పోటీ హారిక - అరియానా మధ్యనే' అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదేదీ నిజం కాదు, ఆల్రెడీ అఖిల్ సార్ధక్ పేరుతో టైటిల్ ఫిక్సయిపోయింది.. అని ఇంకొందరు అంటున్నారు.
ఇదెలా సాధ్యం.? అని అబిజీత్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో 'అబిక' అంటూ అబిజీత్ అభిమానులు, హారిక అభిమానులు.. పరస్పరం ఓట్లను షేర్ చేసుకునేవారు. ఇక్కడ మళ్ళీ అబిజీత్ అభిమానులదే డామినేషన్. ఫైనల్‌కి వచ్చేసరికి.. ఇద్దరూ రేసులో వుండడంతో ఆ ఓట్లు చీలిపోయాయనీ, అది మిగతావాళ్ళకు అడ్వాంటేజ్‌గా మారిందనీ అంటున్నారు. 'తూచ్, అదంతా దుష్ప్రచారం మాత్రమే.. బిగ్‌బాస్ నిర్వాహకులే ఇలాంటి గాసిప్స్‌కి, లీకులకీ ఆస్కారమిస్తున్నారు' అనేది అబిజీత్ ఆభిమానుల ఆరోపణ.
గంపగత్తగా తాము అబిజీత్‌కి ఓట్లు వేశామనీ, దాదాపు 60 శాతం ఓట్ల మెజార్టీతో అబిజీత్ గెలవాల్సి వుందనీ వాళ్ళంతా అత్యుత్సాహం ప్రదర్శించేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న పలు పోల్స్‌లో అబిజీత్ దాదాపు 60 శాతం ఓట్లు సాధిస్తున్నాడు. అయితే, బిగ్‌బాస్ ఓటింగ్ ఫార్మాట్ వేరేలా వుంది. మిస్‌డ్ కాల్స్, హాట్ స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ జరుగుతోంది. దాంతో, ఎన్ని ఓట్లు వచ్చాయన్నది అధికారికంగా నిర్వాహకులే వెల్లడించాలి.
'నువ్వో.. నేనో.. ఈసారి ఖచ్చితంగా అమ్మాయిలే టైటిల్ గెలవాలి..' అంటూ దేవి నాగవల్లితో గతంలో అరియానా చెప్పింది గనుక.. ఆ అరియానా ఫైనల్‌లో వుంది గనుక.. అబిజీత్ అభిమానులు ఆందోళన చెందడంలోనూ కొంత అర్థం వుంది.