బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ‘జోకర్’గా బరిలోకి దిగిన అవినాష్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్‌గా మారిపోయాడనడం అతిశయోక్తి కాదు. అందరినీ మెప్పించడం ద్వారా ఎలాంటి వివాదాలకూ తావివ్వకూడదని అవినాష్ అనుకున్నాడుగానీ, అది కాస్తా ‘సేఫ్ గేమ్’ అనే విమర్శలకు తావిచ్చింది. పైగా, అవినాష్‌ని కొందరు ‘జోకర్’లానే చూశారు. అవినాష్ కామెడీని ఎంజాయ్ చేసి, మళ్ళీ అదే కామెడీని సాకుగా చూపి అవినాష్ మీద విమర్శలు చేశారు. దాంతో, అవినాష్‌కి అసలు గేమ్ ఏంటన్నది అర్థమయిపోయింది.
ప్రస్తుతం హౌస్‌లో అవినాష్‌కి ‘యాంటీ స్క్వాడ్’ ఎక్కువైపోయింది. ఆ బృందంలో సోహెల్, మెహబూబ్, హారిక, అఖిల్ తదితరులున్నారు. మరికొందరు కూడా అవినాష్‌కి వ్యతిరేకంగానే పావులు కదుపుతున్నారు. ఎంత ఎక్కువమంది శతృవులు వుంటే, ఎలిమినేషన్‌కి అంత ఎక్కువ ఛాన్స్ వుంటుంది. ఎందుకంటే, ప్రతి వారం నామినేట్ అయ్యే పరిస్థితిని అవినాష్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాగా, అవినాష్‌కి బయట నుంచి మద్దతు బాగా లభిస్తోంది. సోషల్ మీడియాలో అవినాష్‌కి కుప్పలు తెప్పలుగా అభిమానులు కనిపిస్తున్నారు. అదే అతనికి ప్రస్తుతానికి శ్రీరామరక్ష. కానీ, ఈ మద్దతు ఎప్పుడూ ఇలాగే వుంటుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘పాయింట్ టు పాయింట్’ పక్కాగా మాట్లాడే అవినాష్, ‘గేవ్ు’ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తున్నాడు.