బిగ్‌బాస్‌లో బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'డే'.!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో వాతావరణం కూల్‌ అయ్యింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ వాతావరణం నెలకొంది. గొడవలకు అస్సలు తావే లేదు. ఇది ప్రస్తుతం. టాస్క్‌లో భాగంగా ఒకరి క్యారెక్టర్స్‌ ఒకరు మార్చుకోవాలని బిగ్‌బాస్‌ సూచించిన సూచన మేరకు గీత క్యారెక్టర్‌ తనీష్‌కీ, కౌషల్‌ క్యారెక్టర్‌ దీప్తికి వచ్చింది. ఇద్దరూ ఇద్దరే దున్నేశారంతే. జబర్దస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చారు. 

బిగ్‌బాస్‌ వీక్షించిన వీక్షకులు గీత క్యారెక్టర్‌లో తనీష్‌ పర్‌ఫామెన్స్‌కి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అలాగే కౌషల్‌ పాత్రలో దీప్తి అచ్చు కౌషల్‌లాగానే ఆర్గ్యుమెంట్‌ చేయడం దగ్గర నుండి, తన ఆవేదనను బయట పెట్టుకోవడం దాకా చాలా బాగా పర్‌ఫామ్‌ చేసి చూపించింది. దీప్తి క్యారెక్టర్‌ పోషించిన సామ్రాట్‌ కూడా ఏం తక్కువ తినలేదు. దీప్తి నడక, నడత అంతా కరెక్ట్‌గా పట్టేశాడు. తన పర్‌ఫామెన్స్‌ని తనీష్‌లో చూసుకోలేక బిత్తరపోయింది గీత. ఇక తనీష్‌ క్యారెక్టర్‌లో గీత స్మోకింగ్‌ రూమ్‌లో స్మోక్‌ చేయడం అప్పుడప్పుడూ నిద్ర పోవడంలాంటి చేష్టలతో ఆకట్టుకుంది. 

సామ్రాట్‌ పాత్రలో చిలిపి చేష్టలతో ఆకట్టుకున్నాడు కౌషల్‌. ఇలా బిగ్‌బాస్‌ షో కాస్త జబర్దస్త్‌ షో అయిపోయింది సడెన్‌గా. సెలిబ్రిటీలు ఐదుగురూ ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌ చేశారు. చివరగా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటూ వచ్చిన ఓ సామాన్య యువకుడు తెచ్చిన గిఫ్ట్స్‌తో ఇంటి సభ్యులు ఫుల్‌ ఖుషీ అయ్యారు. గొడవలు, కుట్రలు, కుతంత్రాలు, త్యాగాలు, దెబ్బలు ఇలా ఇన్ని భావోద్వేగాల మధ్య సాగిన బిగ్‌బాస్‌ షో 

ఈ ఆదివారంతో ముగియనుంది. బిగ్‌బాస్‌ టాప్‌ లెవల్‌లో నిలిచేదెవరో.? టైటిల్‌ దక్కించుకునేదెవరో.? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS