చరణ్‌ - బోయపాటి టైటిల్‌ ఏంటంటే.!

By iQlikMovies - September 26, 2018 - 13:29 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి టైటిల్‌ ఇదేనంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రామ్‌చరణ్‌ లుక్‌ని బట్టి ఈ సినిమాకి 'స్టేట్‌ రౌడీ' అనే టైటిల్‌ అనుకుంటున్నారట అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

గతంలో చిరంజీవి నటించిన సినిమా పేరు 'స్టేట్‌రౌడీ'. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అది. బోయపాటి సినిమాలంటే మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్సే ఉంటాయి. కాబట్టి ఈ సినిమాకి ఆ టైటిల్‌ అయితే బావుంటుందనీ, అభిమానులు భావిస్తున్నారట. అయితే ఈ టైటిల్‌ విషయంలో చిత్ర యూనిట్‌ ఏమనుకుంటుందనే విషయంపై క్లారిటీ లేదు. కానీ గతంలోనూ చరణ్‌ నటించిన 'బ్రూస్‌లీ' సినిమా విషయంలోనూ ఇలాగే ప్రచారం జరిగింది. 

'బ్రూస్‌లీ' సినిమాకి 'గ్యాంగ్‌లీడర్‌' టైటిల్‌ అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆ టైటిల్‌ పెట్టలేదు. అలాగే ఇప్పుడు కూడా జరుగుతుందేమో. మరోవైపు 'రాజవంశస్థుడు' అనే టైటిల్‌ కూడా గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈ సినిమాకి ఏ టైటిల్‌ ఫిక్స్‌ చేస్తారో తెలీదు కానీ, 'రంగస్థలం' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత చరణ్‌ నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ నుండి అతి భారీ అంచనాలున్నాయి ఈ సినిమా మీద. 

'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో షూటింగ్‌ జరుగుతోంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS