ఫినాలే టాస్క్‌ల్లో భాగంగా, నామినేషన్ ప్రక్రియ కోసం ఇద్దరిద్దరు పోటీ పడిన తర్వాత, రాహుల్ మినహాయించి మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లకు సోలో టాస్క్‌లు ఇవ్వడం జరిగింది బిగ్‌బాస్. ఈ సోలో టాస్క్‌ల్లో వరుణ్ ఓ పొడవాటి రాడ్‌ని ఓ రింగ్‌లో పెట్టి పట్టుకొని నిలబడాల్సి వచ్చింది. రింగులో పెట్టాలి కానీ, రాడ్ ఎక్కడా టచ్ కాకుండా గాల్లోనే ఉండాలి. నిలబడి చేతులతో మాత్రమే ఆ రాడ్‌ని పట్టుకోవాలి. కొన్ని గంటల పాటు వరుణ్ ఈ రాడ్‌ని పట్టుకుని నిలబడాల్సి వచ్చింది.
బాబా భాస్కర్ ఓ ఎత్తైన స్థంభంపై అమర్చిన అతి చిన్న అమరికలపై కాళ్లు పెట్టి ఆ స్థంభాన్ని పట్టుకుని నిలబడాల్సి వచ్చింది. ఈయనదీ టఫ్ టాస్కే. ఆలీ తాళ్లకు వేలాడదీసిన బరువుల్ని బిగ్‌బాస్ సూచించిన నిబంధనలో రెండు చేతులతోనూ పట్టుకుని నిలబడాలి. శివజ్యోతి పచ్చి గుడ్లను, పాలలో వేసుకుని తాగాలి. ఇక అసలు సిసలు టాస్క్, ఓ పెద్ద చేప నోట్లో మాత్ ఆర్గాన్ పెట్టి, ఆ చేపను చేతిలో పట్టుకుని, చేప నోట్లో ఉన్న మౌత్ ఆర్గాన్‌ని తన నోటితో ఊదాల్సి వచ్చింది. శ్రీముఖికి చచ్చినంత పనే.
అయినా, మిగిలిన వారితో పోల్చితే, శ్రీముఖి టాస్క్ కొంత బెటర్ అని చెప్పాలి. 'చేపనైనా కాకపోతిని, శ్రీముఖి పెదాలను తాకనైతిని.. (చేపతో లిప్‌లాక్)' అంటూ నెట్టింట్లో హుషారుగా పాటలు పాడుకుంటున్నారు. అలా తాజా బిగ్‌బాస్ ఎపిసోడ్ కొంచెం విచిత్రంగా వీక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసింది.