రికార్డ్ స్థాయిలో సేతుపతి రెమ్యునరేషన్

మరిన్ని వార్తలు

స్మాల్ స్క్రీన్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ కార్యక్రమం మొదట హిందీలో స్టార్ట్ అయ్యి తరవాత అన్ని భాషల్లోనూ మొదలయ్యింది. తెలుగులో 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో రీసెంట్ గా 8 సీజన్ మొదలయ్యింది. అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలే హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని, మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. ఇదే షో కి తమిళం లో ఇప్పటివరకు కమల్ హాసన్ హోస్ట్ గా ఉన్నారు. కమల్ బిజీ షెడ్యూల్ కారణంగా హోస్ట్ బాధ్యత నుంచి  తప్పుకున్నారు. త్వరలో బిగ్ బాస్ తమిళ సీజన్ 8 మొదలు కానున్న నేపథ్యంలో విజయ్ సేతుపతి హోస్ట్ గా కన్ఫర్మ్ అయ్యారు. 


ఇప్పటివరకు సపోర్ట్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా, నిర్మాతగా, ఇలా పలు పాత్రల్లో జీవించిన సేతుపతి ఇప్పుడు హోస్ట్ గా టెలివిజన్ పై దర్శన మివ్వబోతున్నాడు. స్టార్ విజయ్ లో అక్టోబర్ 6 నుంచి సీజన్ 8 ప్రారంభం కానుంది. ఆరోజే సేతుపతి కంటెస్టెంట్స్ ని పరిచయం చేసి హౌస్ లోకి పంపించేందుకు రెడీ అవుతున్నాడు. అన్ని పాత్రల్లో మెప్పించిన సేతుపతి హోస్ట్ గా ఎలా మెప్పిస్తాడా అన్ని ఆడియన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. 


సేతుపతికి 2024 బాగా కలిసి వచ్చినట్టు ఉంది. మొదట జవాన్ తో బాలీవుడ్ లో బిగెస్ట్ హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ 'మహారాజా' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకుని మంచి పాజిటీవ్ వైబ్రేషన్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అందరు స్టార్ హీరోలున్నా, కమల్ స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ సేతుపతిని  వరించింది. ఈ గోల్డెన్ ఛాన్స్ తో పాటు భారీ పారితోషికం కూడా తీసుకుంటున్నట్లు టాక్. కేవలం వారానికి రెండు రోజులు కనిపించేందుకు  60 కోట్ల రెమ్యున రేషన్ ఆఫర్ చేశారట బిగ్ బాస్ నిర్వాహకులు. విజయ్ ఒక్కో సినిమాకి 15 నుంచి 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కానీ బిగ్ బాస్ షో కి మూడు రేట్లు ఎక్కువ మొత్తం తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS