బిగ్‌హౌస్‌లోకి అడుగు పెట్టాక, బిగ్ బాస్ ఏం చెబితే అది చెయ్యాల్సిందే. 'నేను చెయ్యను..' అని ఎవరైనా మొండికేస్తే అంతే సంగతులు. కానీ, బిగ్‌బాస్ ఇచ్చిన ఓ టాస్క్‌ని చేసేందుకు అబిజీత్ ససేమిరా అన్నాడు. అయితే, టాస్క్ చెయ్యకూడదన్నది అబిజీత్ ఉద్దేశ్యం కాదు. ఆ టాస్క్‌కి సంబంధించి ఇచ్చిన 'లీడ్' అతనికి నచ్చలేదు. నిజానికి ఇది చాలా కీలకమైన పాయింట్.
'మోనాల్ గజ్జర్‌ని మీరిద్దరూ ఏడిపించారు గనుక..' అంటూ 'స్మశానంలో డేటింగ్' పేరుతో ఓ టాస్క్ ఇచ్చాడు అబిజీత్. కానీ, దాన్ని అబిజీత్ చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే కదా.. అని అబిజీత్ కమిట్ అయిపోయి వుంటే, క్రెడిబిలిటీని కోల్పోయేవాడు. ఇక్కడే అబిజీత్, చాలా తెలివిగా ఆలోచించాడు. తెలివిగా కాదు, చాలా సాధారణంగా బుర్రపెట్టి ఆలోచించాడు. 'ఏముంది ఇందులో..' అని అఖిల్ లైట్ తీసుకున్నాడుగానీ, అందులో విషయమేంటో అతనికి అర్థం కాలేదు.
'మమ్మీ..' అంటూ ఓ సందర్భంలో అర్థం పర్థం లేని ఏడుపు ఏడ్చిన అఖిల్‌కీ, హౌస్‌లో ఇప్పటిదాకా కంట నీరు రానివ్వకుండా కనిపించిన అబిజీత్‌కీ అదే తేడా. అంతా ఊహించినట్లుగానే మోనాల్‌తో అబిజీత్ డేటింగ్‌కి వెళ్ళాడు స్మశానంలో. అదసలు డేటింగ్ అని అనగలమా? బిగ్‌బాస్ సీజన్ 4కి సంబంధించి ఇదో అతి చెత్త టాస్క్‌గా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో అబిజీత్, టాస్క్ వరకూ వెళ్ళకపోయినా ముందే గెలిచేశాడు అభిమానుల మనసుల్ని. అదే అతి ముఖ్యం బిగ్‌బాస్‌లో.