బిగ్‌బాస్‌లో గొడవలు సర్వసాధారణం. ఒక్కోసారి భౌతికంగా ఇద్దరు కంటెస్టెంట్స్ తలపడాల్సి రావొచ్చు. ఆ సమయంలో ఎవరు సంయమనం కోల్పోయిన, పరిస్థితి చెయ్యిదాటుతుంది. గతంలోనూ ఇలాంటి సందర్భాలు చూశాం. ఇక, ఇప్పుడు బిగ్‌హౌస్‌లో గంగవ్వ వృద్ధురాలు. ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు హౌస్‌లో ఏర్పాటు చేశారు. అయితే, పోటీ అన్నాక కంటెస్టెంట్స్ అంతా ఒక్కటే కదా.! తాజా ఎపిసోడ్‌లో మోనాల్ గజ్జర్‌కీ, గంగవ్వకీ మధ్య రచ్చ జరిగింది.
ఓ దశలో గంగవ్వ సంయమనం కోల్పోయి, కుర్చీని నేలకేసి కొట్టింది మోనాల్ మీద కోపంతో. ఆ పని గంగవ్వ చేసింది కాబట్టి సరిపోయింది. అదే పని మోనాల్ గజ్జర్ చేసి వుంటే! ఇప్పుడు ఇదే అంశాన్ని మోనాల్ గజ్జర్ అభిమానులు ప్రస్తావిస్తూ, బిగ్‌బాస్‌ని నిలదీస్తున్నారు. కంటెస్టెంట్స్ అందరికీ ఒకే రూల్ వుండాలనీ, ఒకరికి ఒకలా.. ఇంకొకరికి ఇంకోలా రూల్స్ సబబు కాదన్నది మోనాల్ గజ్జర్ అభిమానుల వాదన. హద్దులు మీరి మాట్లాడితే శిక్షలు తప్పవంటున్న బిగ్‌బాస్, గంగవ్వ చేసిన పనిపై ఎందుకు స్పందించలేదని మోనాల్ అభిమానులు నిలదీస్తున్నారు.
జైల్లో పెట్టాల్సింది నోయెల్‌ని కాదు, గంగవ్వని.. అంటూ మోనాల్ అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన చేస్తుండడం గమనార్హం. అయితే, మోనాల్ కూడా లాస్యని లాగే క్రమంలో కొంత దురుసు వైఖరి ప్రదర్శించింది. లాస్య, మోనాల్.. ఇద్దరూ కిందపడిపోయారు. మోనాల్‌కి కూడా దెబ్బ గట్టిగానే తగిలింది.. కనిపించని దెబ్బ అది. మోనాల్ అగ్రెసివ్ నేచర్ కాస్తా ఆమెకు మైనస్‌గా మారిపోయింది.