లెజెండరీ బాలు ఇకలేరు.

మరిన్ని వార్తలు

సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. ఆయన తుది శ్వాస విడిచారు.  కరోనా నుంచి కోలుకున్న ఆయనకు మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది. గత నెలన్నరగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఇంతలోనే మళ్ళీ విషమించింది. కొద్దిసేపటి క్రితమే ఆయన శివైక్యం చెందారు.

 

ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడానికి సిద్దమౌతున్నాయి.   మొన్ననే  తన తండ్రి బాగానే కోలుకుంటున్నారని బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ వెల్లడించారు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ చేస్తున్నారని, ఆస్పత్రి సిబ్బంది సహాయంతో లేచి కూర్చుంటున్నారని చెప్పారు.  ఇంతలోనే ఈ బాబు గారి ఆరోగ్యం విషమించి పరిస్థితి చేయి దాటిపోయింది. బాలు ఇక లేరనే వార్త అభిమానులు జీర్చించుకోవడం కష్టం. దేశం గర్వించదగ్గ గాయకుడు బాలు. ఆయన మరణంతో సినీ సంగీతంలో ఓ శకం ముగిసినట్లయింది.  

spb death news


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS