బిగ్‌బాస్ రియాల్టీ షో ముగింపు దశకు వచ్చేసింది. ఈ వీకెండ్ తెలిసిపోతుంది తెలుగు వెర్షన్, నాలుగో సీజన్ విజేత ఎవరన్నది. రేసులో ఐదుగురున్నారు. ఓట్ల వేటలో అబిజీత్ అందరికన్నా ముందున్నాడు. అరియానా గ్లోరీ రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది. అయితే, ఇదంతా అనధికారికంగా సోషల్ మీడియాలో నడుస్తున్న పోల్స్ సారాంశం. సాధారణంగా ఇదే ఫలితం, రియాల్టీలోనూ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎందుకంటే, ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, అందరికన్నా ముందు చెప్పింది సోషల్ మీడియానే ఇప్పటిదాకా.
టాప్ 5లోకి ఎవరెవరు ఏ లైన్‌లో వెళతారన్నదీ సోషల్ మీడియా ముందే చెప్పేయడం చూశాం. ఇదిలా వుంటే, గత సీజన్లలో కంటెస్టెంట్లుగా వున్న కొందరు, తాజా కంటెస్టెంట్స్‌తో లైవ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా అఖిల్ పులిహోర వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్ల కంటెస్టెంట్స్, ఈ వారం కంటెస్టెంట్స్ అందరితోనూ మాట్లాడినా, అందరికంటే ఎక్కువ స్కోప్ అఖిల్‌కి దక్కింది. దీనర్థం, అఖిల్‌ని ఈ సీజన్ విజేతగా ముందే డిసైడ్ చేశారేమోననే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే, దీన్ని చాలామంది తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఓట్ల పరంగా అబిజీత్ ముందుంటే, అఖిల్‌కి ఎలా ఆ 'ట్రోఫీ' ఇచ్చేస్తారన్నది చాలామంది వాదన. మరోపక్క, మూడు సీజన్లలోనూ మేల్ కంటెస్టెంట్స్‌నే విజయం వరించిన దరిమిలా, ఈసారి తప్పక ఫిమేల్ కంటెస్టెంట్‌కి టైటిల్ ఇవ్వాల్సి వుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కోటా కింద ఫిమేల్ కంటెస్టెంట్‌కి ఇచ్చినా, ఓట్ల లెక్కలు చూసి అబిజీత్‌కి ఇచ్చినా, 'పులిహోర' స్పెషలిస్ట్ అఖిల్, పులిహోర అయిపోవడం ఖాయం.