బిగ్ బాస్ హౌస్‌లోనే ఎంటర్‌టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు లోబో. తన చుట్టూ ఎప్పుడూ నవ్వులే. తన పంచ్ లతో, కామెడీతో.. తెగ నవ్వించేవాడు. ఇప్పుడు తనే ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్ బాస్ 5 నుంచి... ఈ వారం లోబో ఎలిమినేట్ అయ్యాడు. 8వ వారం నామినేషన్స్‌లో రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోబో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆరుగురూ టఫ్ కంటెస్టెంట్లే. దాంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ సారి బిగ్ బాస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్‌లో అందరితో కలివిడిగా ఉంటూ వచ్చిన లోబోకి ఈ సారి ఓట్లు తక్కువ పడ్డాయి. దాంతో లోబో బయటకు రాక తప్పలేదు. తన ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో సందడి తగ్గేలా కనిపిస్తోంది. ఆ బాధ్యతని రవి, షణ్ముఖ్ పంచుకోవాల్సిందే మరి.
అయితే ఈ వారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది. దీపావళి స్పెషల్ కదా. అందుకే సుమతో పాటుగా విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఈ స్పెషల్ షోకి హాజరయ్యారు. సుమ పంచ్‌లు, విజయ్ సెన్సాఫ్ హ్యూమర్‌తో... ఈ స్పెషల్ షో ఆసక్తికరంగా సాగిపోయింది.