బిగ్ బాస్ 6 విజేతగా నిలిచాడు... గాయకుడు రేవంత్. బిగ్ బాస్ గ్రాండ్ ఫినలేలో... చివరి వరకూ నిలిచిన రేవంత్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ఈ సీజన్‌లో ముందు నుంచీ.. రేవంత్ గెలుస్తాడన్న ఊహానాగాలు వ్యక్తమయ్యాయి. చివరికి అదే నిజమైంది. ఫినాలే.. ఈరోజు మాటీవీలో ప్రసారం కానుంది. అయితే.. దీనికి సంబంధించిన షూట్ నిన్ననే జరిగిపోయింది. అందుకే... విజేత ఎవరన్న విషయం బయటకు ముందే లీకైపోయింది. శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడని సమాచారం. సామాన్యుడిగా అడుగుపెట్టిన ఆదిరెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకొన్నాడు. కీర్తి నాలుగు స్థానంలో నిలిచింది. ఫైనల్ విన్నర్‌కి రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఓ కారు, పాతిక లక్షలు విలువ గల స్థలం లభించాయి.
ఈ షోకి... రవితేజ, అఖిల్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టడం ఈ హీరోలకు ఇదే తొలిసారి. వచ్చేవారం `ధమాకా`, `18 పేజీస్` చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ రెండు సినిమాల ప్రమోషన్లు కూడా ఇదే వేదికపై జరిగిపోయాయి. బిగ్ బాస్ 7 సీజన్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో ఇదే వేదికపై ఓ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆ సీజన్‌లో నాగ్ కనిపిస్తాడా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.