బిగ్ బాస్ ఇంట అవార్డుల పంట

By iQlikMovies - September 30, 2018 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ సీజన్ 2 ఇంకొక రెండు గంటల్లో ముగియనుంది. ఈ తరుణంలో నిన్న బిగ్ బాస్ ఇంటిలో ఈ సీజన్ లో పాల్గొన్న సభ్యులందరికి అవార్డులు అందచేశారు. అయితే ఈ సారి ఫైనల్ రోజు కాకుండా ముందు రోజే అవార్డులని ప్రధానం చేయడం జరిగింది.

ఇక ఆ అవార్డులలో రెండు అవార్డులని సామ్రాట్ & దీప్తి సునైనా సొంతం చేసుకోగా మిగతా ఇంటి సభ్యులందరికీ ఒక్కొక అవార్డు లభించింది. ఇక ఈ ఎపిసోడ్ కి రోల్ రైడా & అమిత్ యాంకర్లుగా వ్యవహరించిగా గీత తన పాటలతో మిగతా ఇంటి సభ్యులు తమ డ్యాన్సులతో ఈ సీజన్ ని ఘనంగా ముగించారు.

అయితే ఈ సీజన్ చాలా ఒడిదొడుకుల మధ్య జరిగిందనే చెప్పాలి. కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా చేసిన హంగామా, ఇంటి సభ్యుల మధ్య గొడవలు ఈ సీజన్ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు.

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఈరోజుతో గ్రాండ్ గా ముగిసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS