హేమ్‌ అవుట్‌ తమన్నా ఇన్‌!

By iQlikMovies - July 29, 2019 - 09:50 AM IST

మరిన్ని వార్తలు

బిగ్‌ హౌస్‌ నుండి ఫస్ట్‌ ఎలిమినేషన్‌ జరిగిపోయింది. హౌస్‌లో హేమ డామినేషన్‌ కారణంగా, హేమక్క తోపు.. అనే టాగ్‌లైన్‌ వేసేశారు. అదే కారణంగా బిగ్‌హౌస్‌ నుండి ఆమెని తోసేశారు. కామెడీ రోల్స్‌తో బిగ్‌ స్క్రీన్‌ మీద మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హేమ, బుల్లితెర బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి మాత్రం 'బ్యాడ్‌' అనే మార్క్‌ వేసుకుని బయటికి వచ్చింది.

 

అయితే, బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌ నామినేషన్స్‌ స్టార్ట్‌ అయినప్పుడే ఫస్ట్‌ ఎలిమినేషన్‌లో హేమ పేరు ప్రచారంలో ఉంది. అందుకు తగ్గట్లే హేమను తొలి వారమే, బిగ్‌హౌస్‌ నుండి బయటికి పంపించేశారు. హేమ ప్లేస్‌లో ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా సింహాద్రిని బిగ్‌బాస్‌ 15వ కంటెస్టెంట్‌గా వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపించబోతున్నామని నాగార్జున అనౌన్స్‌ చేశారు. ఆల్రెడీ పెళ్లయిన కపుల్‌ని బిగ్‌హౌస్‌లోకి పంపించి, ఓ కొత్త చరిత్ర సృష్టించారు బిగ్‌బాస్‌లో. ఇప్పుడు తమన్నా ఎంట్రీతో మరో కొత్త సెన్సేషన్‌ సృష్టించబోతున్నారు. అయితే, తమన్నా సింహాద్రిని ఇంకా హౌస్‌లోకి పంపించలేదు.

 

తమన్నా హౌస్‌లో ఎలా ఉండబోతోంది.? అందరితోనూ ఎలా కలిసి మెలిసి మనగలుగుతుంది.? ఆమె కారణంగా హౌస్‌లో ఎలాంటి అలజడి కలగబోతోంది.? అనే ప్రశ్నలు ఆడియన్స్‌లో మెదులుతున్నాయి. హౌస్‌లో ఆమె ఎంట్రీ చూస్తే కానీ, ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదేమో. మరోవైపు, ఇప్పటికే రియల్‌ కపుల్‌ వితికా - వరుణ్‌ కారణంగా కొన్ని కాంట్రవర్సీలు మనం చూసేశాం. ఇక తమన్నాతో ఎలాంటి కాంట్రవర్సీలకు బిగ్‌బాస్‌ వేదిక కానుందో ఇకపై చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS